విధి నిర్వహణలో ప్రతిభ.. సీపీ ప్రశంస
- 14 మంది పోలీసులు, ముగ్గురు వ్యక్తులకు సత్కారం
సిద్దిపేట క్రైం, నవంబర్ 4: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన 14 మంది పోలీసు సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) ప్రశంసించారు. అదేవిధంగా మార్కూక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దొంగని పట్టుకోవడంలో సహకరించిన ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకంగా అభినందించారు.
బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు, ప్రత్యేక కిట్లను అందజేశారు. అనంతరం సీపీ వారితో ముచ్చటించారు. కానిస్టేబుళ్లు ఆంజనేయులు(షీ టీం), డి.స్వామి(రాయపోల్), జి.వికాస్ రెడ్డి, సీహెచ్. పృథ్వి(బెజ్జంకి), పి.కళ్యాణ్ (సిద్దిపేట త్రీ టౌన్), ఎస్.రవి (సిద్దిపేట రూరల్), డి.శ్రీనివాసరెడ్డి (హెడ్ కానిస్టేబుల్, కోర్ట్ లైజనింగ్), వీరేశం (కోహెడ), ప్రదీప్ (దుబ్బాక), అమరేందర్ (మిరుదొడ్డి), కిష్టయ్య, తిరుపతి(చిన్నకోడూరు), భూమలింగం, రాజు (వన్ టౌన్)లతోపాటు కటకం కరుణాకర్, చెక్కల నాగరాజు, మ్యకల శ్రీనివాస్ లను సీపీ సన్మానించారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అభినందనలు
ఈ ఏడాది మొత్తం 16 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యేలా ప్రతిభ కనబరిచిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మారాములును పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించి, సత్కరించారు. కోర్టు విచారణ సమయంలో పక్కా ఆధారాలు సమర్పించి, సమర్థవంతమైన వాదనలు వినిపించి నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో ఆయన చూపిన చొరవ, నిబద్ధతను సీపీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన సేవలు పోలీస్ సిబ్బందికి, ప్రాసిక్యూషన్ విభాగానికి ఆదర్శనీయమని ప్రశంసించారు. ఆత్మారాములుకు శాలువా కప్పి, మెమంటో అందించి ఘనంగా సత్కరించారు.