సిరాజ్‌ను వివాదాల్లోకి లాగొద్దు

26-11-2026 | 05:00am

తుది జట్టు ఎంపికపై కోచ్, కెప్టెన్‌దే నిర్ణయం

రాజీవ్‌శుక్లా వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబర్ 25: వెల్లింగ్టన్ టెస్టులో(Wellington Test) సిరాజ్‌(Siraj)ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన వేళ బీసీసీఐ(BCCI) స్పందించింది. సిరాజ్‌ను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని బీసీసీఐ వైస్‌ప్రెసిడెంట్ రాజీవ్‌శుక్లా(BCCI VP Rajiv Shukla) వ్యా ఖ్యానించారు. అది జట్టుకీ, ఆటగాడికీ కూడా మంచిది కాదన్నారు. సిరాజ్ ప్రధాన జట్టు లో భాగమేనని, అయితే తుది జట్టులో ఎవ రూ ఆడాలనేది పిచ్ పరిస్థితులు, జట్టు ప్ర యోజనాల ఆధారంగా కెప్టెన్ , కోచ్ తీసుకునే నిర్ణయమని చెప్పారు. కేవలం సిరాజ్ ఆడకపోవడం వల్లే వెల్లింగ్టన్ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిందని చెప్పలేమన్నారు.

ఒక ఆ టగాడి ఎంపిక విషయంలో రాజకీయ వివాదాలు సృష్టించడం సరికాదని, ఇలాంటి చర్చలు సిరాజ్ కూడా ఇష్టపడడన్నారు. వెల్లింగ్టన్ టెస్టులో భారత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌లతో బరిలోకి దిగింది. అయితే  సీనియర్ పేసర్ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, కేవలం పేరు కారణంగానే సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఆరోపణలు చేయడంతో ఈ అం శం రాజకీయ రంగు పులుముకుంది.

మరిన్ని వార్తలు