టాప్ ప్లేస్‌కు చేరువలో బుమ్రా

26-11-2026 | 05:15am

రాబిన్సన్‌తో కలిసి రెండో స్థానం

బ్యాటింగ్ టాప్ 10లో ముగ్గురు భారత క్రికెటర్లు

దుబాయి, నవంబర్ 25: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Indian star pacer Jasprit Bumrah) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో(ICC Test rankings) అగ్రస్థానానికి చేరువయ్యాడు. చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్(Test match) ఆడిన బుమ్రా కివీస్‌పై ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ముఖ్యంగా కీవీస్ ఓపెనర్ టామ్ లేథమ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో తాజా జాబితాలో మూడు స్థానాలు మెరుగయ్యాడు. 856 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్(England bowler) ఒలీ రాబిన్సన్(Ollie Robinson) కూడా రెండో స్థానంలో బుమ్రాతో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

881 రేటింగ్స్ పా యింట్లతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి బుమ్రా ఒక్కడే ఉన్నాడు. ఇక రెండు టెస్టులోనూ సత్తా చాటితే టాప్ ప్లేస్‌ను దక్కించుకునే అవకాశముంది. మరోవైపు ఇదే టెస్టులో బ్యాటింగ్‌లో రాణించిన భారత క్రికెటర్ల ర్యాంకులు కూడా మెరుగుపడ్డాయి.

128 పరుగులతో అదరగొట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి అతడిదే అత్యుత్తమ ర్యాంకుగా ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 3 స్థానాలు ఎగబాకి 7 స్థానం లో నిలవగా, యశస్వీ జైస్వాల్ ఐదు ప్లేస్‌లు మెరుగై తొమ్మిదో ర్యాంకులో నిలిచాడు. 

మరిన్ని వార్తలు