ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

18-10-2026 | 05:20am

ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 17 : మినీ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలు(IPL franchises) తమ సపోర్టింగ్ స్టాఫ్‌ను ప్రక్షాళన చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కీల క మాజీ ఆటగాళ్లను తమ ఫ్రాంచైజీ సహాయక సిబ్బందిలోకి తీసుకుంటోంది. ఇప్ప టికే హెడ్ కోచ్‌గా గంగూలీని, బ్యాటింగ్,అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్‌ను నియ మించిన ఢిల్లీ ఫ్రాంచైజీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లంక దిగ్గజ ఆటగాడు చమిందా వాస్‌కు బా ధ్యతలు అప్పగించింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. వినూత్నమైన వీడియోతో చమిందా వాస్ ఎంపికను ధ్రువీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 52 ఏళ్ల చమిందా వాస్.. శ్రీలంక తరఫున 1994- 2009 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 322 వన్డే లు, 162 టెస్టు లు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లంక పేసర్ వన్డేల్లో 400, టెస్టుల్లో 355, టీ20ల లో ఆరు వికెట్లు పడగొట్టాడు. గతంలో శ్రీ లంక పురుషుల జట్టు కోచ్‌గా ఉన్న చమిం దా వాస్.. న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లకు కన్సల్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేకాదు వివిధ లీగ్స్‌లో కోచ్‌గా పనిచేసిన అను భవం కూడా ఉంది. ఇదిలా ఉంటే భారత మాజీ బౌలర్ అమిత్ మిశ్రా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఢిల్లీ జట్టులో చేరే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు