రంజీ బరిలో గిల్
- ఛత్తీస్‌గఢ్‌పై ఆడనున్న భారత కెప్టెన్
- న్యూజిలాండ్ టూర్‌కు వ్యక్తిగత నెట్ బౌలర్లు
- టెస్ట్ సిరీస్‌లో రాణించడమే లక్ష్యం
ఛండీఘర్, అక్టోబర్ 17 : న్యూజిలాండ్ టూర్లో రాణించడమే లక్ష్యంగా భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్(Indian team captain Shubman Gill) కీలక నిర్ణయం తీసుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌పై మరింతగా ఫోకస్ పెట్టే క్రమంలో రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఆడబోతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ తరపున బరిలోకి దిగనున్నాడు. కివీస్‌తో టెస్ట్ సిరీస్‌లో ఫామ్ కొనసాగించాలని పట్టుదలగా ఉన్న గిల్ దానికి తగ్గట్టే ప్ర ణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
దీనిలో భాగంగా వ్యక్తిగతంగా ఐదుగురు నెట్ బౌలర్లను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లను న్నాడు. ఈ ఐదుగురు నెట్స్‌లో గిల్‌కు మాత్రమే బౌలింగ్ చేస్తారు. వీరికి సంబంధించిన ఖర్చులన్నీ గిల్ భరించనున్నాడు. సాధారణంగా ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్లినప్పు డు జట్టుతో పాటే నెట్ బౌలర్లను కూడా బీసీసీఐ పంపిస్తుంది. కివీస్ టూర్ కోసం కూడా బోర్డు పలువురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. కానీ గిల్ మాత్రం తన వ్యక్తిగతంగా మరో ఐదుగురిని తీసుకెళ్లనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా చెప్పడం, అనుమతి పొందడం కూడా జరిగినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇంగ్లాం డ్ పర్యటనలో గిల్ అద్భుతంగా రాణించాడు. 754 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాంటి ప్రదర్శనే కివీస్ గడ్డపైనా కనబరిచేందుకు ఉవ్విళ్లూరుతున్న గిల్ దాని కోసం ముమ్మరంగా సాధ న చేస్తున్నాడు. టెస్ట్ సిరీస్ కోసం వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు కూడా గిల్ ఆడడం లేదు. భార త జట్టు న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 22 నుంచి మొదలవుతుంది. ఈ టూర్లో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడుతుంది.
గిల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అటు మరికొందరు కీలక ఆటగాళ్లు కూడా చివరి రెండు వన్డేలు ఆడడం లేదు. టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.