హైలో ఓపెన్ విజేతలు సింధు, లక్ష్యసేన్
చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు
సార్‌బ్రూకెన్, నవంబర్ 1 : భారత బ్యాడ్మింటన్ స్టార్లు(Indian badminton stars) పీవీ సింధు, లక్ష్యసేన్(PV Sindhu, Lakshya Sen) చరిత్ర సృష్టించారు. జర్మనీ వేదికగా జరిగిన హైలో ఓపెన్ సూపర్ 500 టైటిళ్లను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్‌తో పాటు పురుషుల సింగిల్స్ విభాగాల్లో మన ప్లేయర్స్ అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్లుగా నిలిచారు.
మొదట మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు, డెన్మార్స్‌కు చెందిన లినె హాజ్మార్క్ జెర్బెల్ట్‌ను 21 21 తేడాతో వరుస గేముల్లో ఓడించింది. సింధుకు ఈ సీజన్‌లో ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కాగా ఆమె కెరీర్‌లో ఇది 7వ వరల్డ్ టూర్ టైటిల్. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన స్మాష్‌లతో ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సింధు ట్రోఫీ సొంతం చేసుకుంది..
మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ అదరగొట్టాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ అయిన లక్ష్యసేన్, ప్రపంచ 6వ ర్యాంకర్ ఇండోనేసియాకు చెం దిన జొనాథన్ క్రిస్టీని 21 21- తేడా తో ఓడించి టైటిల్ గెలిచాడు.కేవలం 39 నిమిషాల్లోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరుతో లక్ష్యసేన్ తన ఏడాది టైటిల్ నిరీక్షణకు తెరదించాడు. ఇది 2026 సీజన్లో అతడికిది మొదటి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్.