కబడ్డీని ఒలింపిక్స్‌లో చేర్చడమే లక్ష్యం
- త్వరలో మహిళల కబడ్డీ లీగ్
- ఐకేఎఫ్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్, నవంబర్ 1 : గ్రామీణ క్రీడ కబడ్డీని 2026 ఒలింపిక్స్‌లో చేర్చడమే లక్ష్యమని ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్(International Kabaddi Federation) (ఐకేఎ ఫ్) అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కబడ్డీకి చోటు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తు న్నామని వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్(International Kabaddi Federation) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు.
కబడ్డీని ఒలింపిక్స్‌లో చేర్చడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు మరింత గుర్తింపు లభించడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. అన్ని దేశాలు కబడ్డీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీకి మరింత ఆదరణ పెంచేందుకు త్వర లో కబడ్డీ వరల్ కప్ నిర్వహించడంతో పాటు మహిళల కబడ్డీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.
ప్ర పంచ కప్ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న దేశాలు తమ ప్రతిపాదనలు, వివరాలను సమర్పించాలని కోరామని, ఆయా దేశాల ఆసక్తిని పరిశీలించిన తర్వాత వేదికను ఖరారు చేస్తామని వెల్లడించారు. మహిళల కబడ్డీ లీగ్‌ను నిర్వహించి మహిళా క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం 62 దేశాలు కబడ్డీలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని చెప్పుకొచ్చారు.