ఫైనల్ చేరేదెవరు?

26-11-2026 | 05:10am
  1. నేడు లంక ఏతో సెమీఫైనల్
  2. వైభవ్ సూర్యవంశీపైనే ఫోకస్
  3. ఆసియాకప్ రైజింగ్ స్టార్స్

దోహా, నవంబర్ 25: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో(Asia Cup Rising Stars Tournament) భారత ఏ జట్టు నాకౌట్ పోరుకు సిద్ధమైంది. గురువారం శ్రీలంక ఏ జట్టుతో సెమీఫైనల్లో తలపడబోతోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో నూ గెలిచిన లంకను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో నూ వైభవ్ సూర్యవంశీపైనే అం దరి చూపు నెలకొంది. యూఏఈపై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెం చరీ బాదేసిన చిచ్చర పిడుగు మరోసారి చెలరేగితే మ్యాచ్ వన్‌సైడ్‌గా మా రడం ఖాయం.

అతన్ని కట్టడి చేయకుంటే లంక బౌలర్లకు చుక్కలే. ఇదిలా ఉంటే భారత్ గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించింది. పాకిస్థాన్ ’ఏ’ చేతిలో 48 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, నేపాల్‌పై 306 పరుగుల భారీ తేడాతో, యూఏఈపై 7 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలోనే అత్యుత్తమ నెట్ రన్ రేట్ (+3.52)తో సెమీస్‌కు దూసుకెళ్లిం ది.కెప్టెన్ తిలక్ వర్మ నిలకడగా రాణిస్తుండడం భారత్‌కు ప్రధాన బలం. అయితే రింకూ సింగ్, ఆయుష్ బదో ని ఫామ్‌లో లేకపోవడం, బౌలర్లు 300+ పరుగులు సమర్పించుకోవడం జట్టును కలవరపెడుతోంది.

హర్షిత్ రాణా, పిన్స్ యాదవ్ వికెట్లు తీస్తున్నప్పటికీ, పరుగులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అర్షద్ ఖాన్ యూఏఈపై 4 వికెట్లతో సత్తా చాటా డు. మరోవైపు శ్రీలం క జట్టు సమష్టి ప్రదర్శనతో సెమీస్‌కు చేరింది. గ్రూప్ స్టేజ్‌లో మూడుకు మూడింటిలోనూ గెలిచింది.పటిష్టమైన స్పిన్ బౌలింగ్ లంకకు అడ్వాంటేజ్. భారత బ్యాటర్లను, ముఖ్యంగా సూర్యవంశీని కట్టడి చేయడానికి లంక స్పిన్నర్లు కీలకం కానున్నారు.

మరిన్ని వార్తలు