సిరీస్ విజయమే లక్ష్యం

13-11-2026 | 05:15am
  1. నేడు కివీస్‌తో నాలుగో వన్డే 
  2. శ్రేయాస్ కెప్టెన్సీకి పరీక్ష
  3. టెస్ట్ సన్నాహాల్లో కీలక ఆటగాళ్లు 
  4. తుది జట్టులో మార్పులు

న్యూజిలాండ్ టూర్‌లో మరో సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా నాలుగో వన్డేకు సిద్ధమైంది. మూడో వన్డే వర్షంతో రద్దయినప్పటకీ 2 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ కోసం గిల్ వెళ్లిపోవడంతో సారథ్య బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ అయ్యర్‌కు ఇది పరీక్షగానే చెప్పాలి.

మౌంగనూయి, నవంబర్ 12 : భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే(India vs New Zealand 4th ODI)కు కౌంట్‌డౌన్ మొదలైంది. వర్షంతో గత మ్యాచ్ రద్దవడం అభిమానులకు నిరాశ కలిగించినా శుక్రవారం మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. అయితే భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ గిల్‌తో సహా పలువురు ఆటగాళ్లు టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం జట్టును వీడారు. దీంతో  శ్రేయాస్ అయ్యర్ తొలిసారి వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇషాన్ కిషన్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు.

గిల్ స్థానంలో రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల క్రితం ఓపెనర్‌గా డబుల్ సెంచరీ చేసిన ఇషాన్‌కు ఇది కీలక అవకాశంగా భావిస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో షార్ట్ బాల్స్ ఆడటంలో ఇబ్బంది పడు తున్న అయ్యర్ కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుని బ్యాట్‌తోనూ రాణించాల్సి ఉంది. అటు తొలి రెండు మ్యాచ్‌లో విఫలమైన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ మిడిలారర్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు.

బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రానున్నాడు. గత వారం ఇం డియా-ఎ తరఫున 4 వికెట్లు తీసిన సిరాజ్, ఈ సిరీస్‌లో తొలిసారి బంతిని అందుకోనున్నాడు. ఆకిబ్ నబీ, అర్షదీప్ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకునే ఛాన్స్ ఉంది. తొలి రెండు వన్డేల్లో భారత యువ పేసర్లు గుర్నూ ర్ బ్రార్, అర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ బ్యాటర్లను తక్కువ స్కోర్లకే కట్టడి చేశారు. మరోవైపు న్యూజిలాండ్ సొం తగడ్డపై వరుసగా 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్లు గెలిచిన రికార్డుకు ఇప్పటికే బ్రేక్ పడింది.

సిరీస్ ఓటమిని తప్పించుకోవాలంటే మిచెల్ సాంట్నర్ సారథ్యంలోని యువ కివీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పుంజుకోవాల్సి ఉంటుంది. టెస్టు సిరీస్ కోసం టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, హెన్రీ నికోల్స్ జట్టును వీడటంతో కివీస్ కూడా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్ బ్రెట్ రాండెల్‌ను న్యూజిలాండ్ జట్టులోకి తీసుకుంది. వన్డే జట్టులో స్థానం కోసం పోరాడుతున్న వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌పై ఒత్తిడి నెలకొంది.

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న బే ఓవల్ పిచ్ సా ధారణంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుం ది. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. తొలి ఇన్నింగ్స్ తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కాస్త సులువుగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు. మొత్తంగా చూస్తే బలమైన బ్యా టింగ్ లైనప్, బౌలింగ్ ఫాంతో ఉన్న భారత్‌కే ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తుది జట్ల అంచనా

భారత్ : రోహిత్, ఇషాన్ కిషన్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రుతు రాజ్, నమ న్ ధీర్, అక్షర్, నబీ, సిరాజ్, బ్రార్, అర్షదీప్ 

న్యూజిలాండ్ : అలెన్, సిఫెర్ట్(కీపర్), విల్ యంగ్, నిక్ కెల్లీ, మిఛ్ హే, బ్రేస్‌వెల్, శాంట్నర్(కెప్టెన్), ఫాక్స్‌క్రాఫ్ట్, జేమీసన్,   ఫిషర్/క్లార్క్, డఫీ

మరిన్ని వార్తలు