భారత్‌కు ఎదురుందా?

30-10-2026 | 05:10am
  1. నేడు కివీస్‌తో నాలుగో టీ20
  2. తుది జట్టులో మార్పులు
  3. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి
  4. పరువు కోసం కివీస్ పోరాటం

సిరీస్ గెలిచాం.. ఇక తర్వాతి లక్ష్యం క్లీన్‌స్వీప్..పనిలో పనిగా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ ప్లేయర్స్‌ను ఆడించడం..ప్రస్తుతం టీమిండియా ముందున్న టార్గెట్ ఇదే. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి సిద్ధమైన భారత్ మరో విజయంపై కన్నేసింది. మరోవైపు సిరీస్ చేజారినా సొంతగడ్డపై పరువు కోసం పాకులాడుతున్న కివీస్ భారత్ జోరుకు బ్రేక్ వేయాలని పట్టుదలగా ఉంది.

ఆక్లాండ్, అక్టోబర్ 29: న్యూజిలాండ్(New Zealand) టూర్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా(Team India) ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3 కైవసం చేసుకుంది. అదే జోష్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దీనిలో భాగంగా భారత్, కివీస్ మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా నాలు గో టీ20 జరగనుంది. సిరీస్ గెలిచిన నేపథ్యంలో భారత్ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చి రిజర్వ్ ప్లేయర్స్‌ను ఆడించబోతోంది. ఈ క్రమంలో తుది జట్టులో మార్పులు జరగనున్నాయి.

గాయంతో గత రెండు మ్యాచ్ లకు దూరమైన ఇషాన్ కిషన్ ఆక్లాండ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. లేకుంటే వైభవ్ సూర్యవంశీనే కొనసాగించనున్నారు. అలాగే ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి విశ్రాంతినిచ్చి శివమ్ దూబేను ఆడించే అవకాశముంది. ఈ సిరీస్‌లో దూబేకు ఇప్పటి వరకూ అవకాశం దక్కలేదు. అటు బౌలింగ్ విభాగంలో నూ మార్పులు జరగనున్నాయి. స్పిన్ విభాగంలో సిరీస్ ఆరంభం నుంచీ బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు చోటు దక్కే అవకాశాలున్నాయి.

పేస్ విభాగంలో అర్షదీప్‌కు రెస్ట్ ఇచ్చి మ యాంక్ యాదవ్‌ను ఆడించే ఛాన్సుంది. ముఖ్యంగా డెత్ బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవడంపైనే టీమిండియా ఫోకస్ పెట్టనుం ది. భువనేశ్వర్ కుమార్‌కు ఈ మ్యాచ్ కీలకమనే చెప్పాలి. గత మూడు మ్యాచ్‌లలో కేవలం ఒకటే వికెట్ తీసాడు. అటు బ్యాటిం గ్ పరంగా మాత్రం భారత్ సూపర్ ఫామ్ లో ఉంది. మూడో టీ20లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదిన ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అతనితో పాటు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించేందుకు ఎదురుచూ స్తున్నాడు. తిలక్, నమన్ ధీర్ మ్యా చ్‌లను ముగిస్తున్నారు. మరోవై పు సిరీస్ కోల్పో యి పరువు కోసం ఆరాటపడుతున్న ఆతిథ్య న్యూజిలాండ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఫాస్ట్ బౌలర్లు లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీలు గాయాల కారణంగా మిగిలిన టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యారు. బౌలింగ్ బలహీనపడడంతో కివీస్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.

కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బంతితో రాణిస్తు న్నా.. మిగతా బౌలర్ల నుంచి తగిన సహకారం లభించడం లేదు.  ఈడెన్ పార్క్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతో భారత్‌ను కట్టడి చేయడం కివీస్‌కు పెద్ద సవాలే. ఆక్లాండ్‌లో బౌండరీలు చిన్నవిగా ఉండడంతో మరోసారి భారీస్కోర్లు ఖాయం. ఇక ఈ మ్యాచ్‌కు దాదాపు 40 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. న్యూజిలాండ్‌లో ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌కు ఇదే అత్యధికం

తుది జట్ల అంచనా 

భారత్ : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ రెడ్డి/దూబే, కుల్దీప్/వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్, ప్రిన్స్ యాదవ్, అర్షదీప్/మయాంక్ యాదవ్

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, సిఫర్ట్, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, మిలైన్, డఫీ, ఫిషర్, టిక్నర్/స్మిత్

మరిన్ని వార్తలు