వరుణుడి ఆటతో సిరీస్ సమం

18-10-2026 | 05:25am
  1. చివరి టీ20 రద్దు
  2. భారత్ స్కోరు 118/5(7.2 ఓవర్లు)
  3. 2 ట్రోఫీ పంచుకున్న ఇరు జట్లు

బెంగళూరు, అక్టోబర్ 17 : ఊహించిందే జరిగింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం(Bengaluru Chinnaswamy Stadium) వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో టీ20 సిరీస్ 2 సమంగా ముగిసింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే సాయంత్రం నుం చి వర్షం పడుతూనే ఉంది. ఈ కారణంగానే టాస్ 2 గంటలు ఆలస్యమైంది.  9 గంటలకు వరుణుడు శాంతించడంతో మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు.

టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చిన్నస్వామిలో భారీస్కోరు సాధించడమే లక్ష్యంగా భారత దూకుడుగా ఆడింది. అభిషేక్ శర్మ(6) నిరాశపరిచినా ఇషాన్ కిషన్ 30(10 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లు), సంజూ శాంసన్ 16(7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడా రు.  శ్రేయాస్ అయ్యర్(22) కూడా చెలరగడంతో భారత్ 2.5 ఓవర్లలోనే 50 పరుగు లు దాటింది. తర్వాత నమన్ ధీర్ 6 బంతుల్లోనే 24 (1 ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోయా డు.

దీంతో భారత్ 7.2 ఓవర్లలో 118/5 స్కోరు దగ్గర వర్షం మళ్లీ అడ్డంకిగా నిలిచింది. ఆ తర్వాత ఎంతకు వరుణుడు శాం తించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. తొలి, మూడు మ్యాచ్‌లలో భారత్ గెలిస్తే, రెండు, నాలుగు టీ20ల్లో వెస్టిండీస్ విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 2 సమంగా ముగిసి ఇరు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. ఈ సిరీస్‌లో 539 రన్స్ చేసిన షై హోప్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

మరిన్ని వార్తలు