ముంబై చేతిలో హర్యానా చిత్తు
8 వికెట్లతో తిప్పేసిన తనీష్
హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ డ్రా
రంజీ ట్రోఫీ రౌండప్
ముంబై, అక్టోబర్ 29: రంజీ ట్రోఫీ(Ranji Trophy) ప్రస్తుత సీజన్లో ముంబై(Mumbai) హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన ఆ జట్టు హర్యానాను 10 వికెట్ల తేడా తో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ(114), ము షీర్ ఖాన్(109) సెంచరీలతో అదరగొట్టారు. తర్వాత హర్యానా తమ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 6 వికెట్లతో సత్తాచాట గా.. తనీష్ కొటియన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అయితే హర్యానాను ముంబై ఫాలో ఆన్ ఆడాలని నిర్ణయించింది. ఫాలో ఆన్‌లో నూ హర్యానా చేతులెత్తేసింది. ముంబై స్పి న్నర్ తనీష్ కొటియన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి హర్యానాను దెబ్బతీశాడు. హర్యానా తమ రెండో ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ముందు హర్యాని కేవలం 97 పరుగుల స్వల్ప లక్ష్యా న్ని మాత్రమే ఉంచింది.
ఈ లక్ష్యాన్ని ముంబై ఓపెనర్లు కేవలం 10.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించారు. ఓపెనర్ ఆంగ్క్రిష్ రఘువంశీ హర్యానా బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పంజా బ్ తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేయ గా, హైదరాబాద్ 380 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 51 రన్స్ ఆధిక్యం సాధించిన పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌ను 240/6 దగ్గర డిక్లేర్ చేసింది.