కోలుకోని పంత్

02-11-2026 | 05:05am

కివీస్ ఏతో మూడో అనధికారిక టెస్టుకు దూరం

బెంగళూరు, నవంబర్ 1 : టీమిండియా(Team India) వికెట్ కీపర్ బ్యాటర్ రిష బ్ పంత్(Rishabh Pant) గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగే చివరి అనధికారిక టెస్టుకు అతడు దూరం కానున్నాడు. ఇరానీ కప్ సందర్భంగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్న సమయంలో పంత్ ఎడమ వైపు కండరాల నొప్పితో ఇ బ్బంది పడ్డాడు.

అప్పటి నుంచీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాస ప్రక్రియను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోకపోవడంతో కివీ స్ ఏతో మ్యాచ్‌కు తప్పించారు.నొప్పి లేకుం డా సాధారణ స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించినప్పటికీ, పూర్తిస్థాయి వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమ యం పడుతుందని సీవోఈ వర్గాలు తెలిపాయి.

అప్పటి వరకూ బెంగళూరులోనే ఉండనున్నాడు. అయితే పంత్ కివీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకుంటా డా లేదా అనేది తెలియడం లేదు. నవంబర్ 19 నుంచి న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆరం భం కానుండగా, పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధిస్తేనే బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని కివీస్‌కు పంపిస్తుందని సమాచారం. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోసం బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధృవ్ జురెల్‌ను ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు