బంగ్లాపై సౌతా ఫ్రికా ఘనవిజయం

26-11-2026 | 05:05am

2-0తో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్

సెంచూరియన్, నవంబర్ 25: బంగ్లాదేశ్‌తో(Bangladesh) జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను సౌతా ఫ్రికా(Test Series) క్లీన్‌స్వీప్ చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. కగిసో రబా డా, మార్కో జాన్సెన్(Marco Jansen) మూడేసి వికెట్లు తీయ గా ఆన్రీచ్ నోకియా 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 494 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మార్కస్ ఆకీర్మన్ 150 , వి యాన్ ముల్దార్ 100 పరుగులు చేశాడు.

అ నంతరం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది. 49.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన వియాన్ ముల్దార్, రెండో ఇన్నింగ్స్‌లో బంతితో అదరగొట్టాడు.31 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ముల్దర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఆకీర్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కాయి.

కాగా ఈ సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును సఫారీ జట్టు దాదాపుగా ఖాయం చేసుకుంది. ప్రస్తు తం ఆ జట్టు 77.78 విజయశాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత డబ్ల్యూ టీసీ సైకిల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా 7 విజయాలు సాధించగా, 2 మ్యాచ్‌లలో ఓడింది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉం డగా, న్యూజిలాండ్, భారత జట్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు