ఏండ్లు గడుస్తున్నా.. ఎదురుచూపులేనా?
- కలగానే మిగిలిన హుజూర్నగర్ డీఎస్పీ కార్యాలయం
- రెండు నూతన సర్కిల్ కార్యాలయాలకు డిమాండ్
- డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజల వేడుకోలు
హుజూర్నగర్, నవంబర్ 1 : హుజూర్నగర్ కేంద్రంగా పోలీస్ డివిజన్(Police Division) ఏర్పాటుపై ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ స్థానానికి జరిగిన ప్రతీ ఎన్నికల్లో పోలీస్ డివిజన్(Police Division) ఏర్పాటు ఎన్నికల అంశంగా నిలిచింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అ ంశంపై హామీలు గుప్పించారు. 2020 జూన్ 29న అప్పటి మంత్రి కేటీఆర్ ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పుడే డీఎస్పీ ఆఫీస్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు.
మళ్లీ చిగురించిన ఆశలు
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తం గా నూతన పోలీే్స్టషన్లను ఏర్పాటు చేయాల ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ పోలీస్ డివిజన్ పై కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. హ జూర్‌నగర్ డివిజన్లో పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెరువు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో కలిపి సుమారు 2,53,113 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,22,664 మంది, మహిళలు 1,30,432 మంది, ట్రాన్స్‌జెండర్స్ 17 మంది ఉన్నారు.
ప్రజావసరాలకు అనుగుణంగా పోలీస్ సేవలు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే జనాభాకు అనుగుణంగా కొత్త పోల్సీస్టేషన్లు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అయితే జనాభా పెరగడంతో కొత్త మండలాలతో పాటు పంచాయతీల సంఖ్యా పెరిగింది. ప్రతీ మండలంలో 30 నుంచి 40 వేల మంది ఓటర్లు ఉండగా వాటికి అనుగుణంగా పోల్సీస్టేషన్లను పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ డివిజన్ ప్రాధాన్యాన్ని గుర్తించి డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రెండు సర్కిల్ కార్యాలయాల ఏర్పాటుకు డిమాండ్
ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో సీఐ కార్యాలయం ఉంది. ఇక్కడి సీఐ పరిధిలో గరిడేపల్లి, పాలకవీడు, నేరేడుచర్ల, మఠంపల్లి, హుజూర్నగర్ మండలాలు ఉన్నాయి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మిగిలిన మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాలు కోదాడ రూరల్ సర్కిల్ పోలీస్ పరిధిలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఏడు మండలాలను కలిపి హుజూర్‌నగర్‌లో డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఈ ప్రాంత ప్రజలు బలంగా కోరుతున్నారు. దీంతో పాటు మరో రెండు సర్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలు ప్రజల నుంచి వస్తున్నాయి. మేళ్లచెర్వు, చింతలపాలెం, మఠంపల్లి మండలాలను కలిపి కృష్ణ పట్టే సర్కిల్ కార్యాలయం నేరేడుచర్ల, పాలకవీడు,గరిడేపల్లి మండలాలను కలిపి నేరేడుచర్ల సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటున్నారు.
అదేవిధంగా హుజూర్నగర్ టౌన్, రూరల్ మండలాలను కలిపి హజూర్‌నగర్ సర్కిల్ కార్యాలయాన్ని విభజించాలన్న డిమాండ్ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మొత్తం మూడు సర్కిల్ కార్యాలయాలతో పాటు పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకొని మహిళా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఆయా పోలీస్ కార్యాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలి
2019 ఉపఎన్నిక సమయంలో హుజూర్‌నగర్‌లో డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయాలను ఏర్పాటుచేయాలని 100 మంది న్యాయవాదులు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించారు. అప్పటి సీఎం కేసీఆర్ రెండు కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కేవలం ఆర్డీవో కార్యాలయం మాత్రమే మం జూరు చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఏ ర్పాటు చేస్తామంటూ కాలయాపన చేశారు.
దీంతో ఈ లోపు సాధారణ ఎన్నికలు రావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమైనా డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి కక్షిదారులు సత్వర సేవలు పొందేందుకు సహకారం అందించాలి.
కాల్వ శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది, హుజూర్నగర్