జెవివి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

07-10-2026 | 06:20pm

కోదాడ అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఈ నెల 10 ,11 తేదీలలో హైదరాబాద్ లో జరుగు ఆరవ జనవిజ్ఞాన వేదిక(Janavignana Vedika) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఏనుగుల వీరాంజనేయులు కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలకు జనవిజ్ఞాన వేదిక ఆల్ ఇండియా రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకోనున్నట్లు వీరాంజనేయులు తెలిపారు. ఎంపిక చేసిన ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు. సామాన్యులకు సైన్స్ సులభంగా అర్థమయ్యేలా పుస్తకాలు మరియు కరపత్రాలను ప్రచురిస్తుందనీ వీరాంజనేయులు తెలిపారు.

మరిన్ని వార్తలు