కష్ట కాలంలో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు

07-10-2026 | 06:13pm

సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్

కోదాడ అక్టోబర్ 7(విజయక్రాంతి): కష్ట కాలంలో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దని సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్(Social activist Syed Basheeruddin) కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కోదాడ పట్టణంలో అంతర్ డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణానికై ఉన్న తారు రోడ్డు మధ్యలో తవ్వి తొమ్మిది అంగుళాల మెత్తటి పైపులు వేసి కప్పటంలో మురుగునీరు సాఫీగా పారాదని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్న మురుగు కాలువలు సరిగా శుభ్రం చేయని పరిస్థితులు ఉంటే అండర్ డ్రైనేజీ అంటూ వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికే ,ఆ కాలువల ద్వారా ప్రవాహం కూడా అంతగా జరగదు. పట్టణంలో ఒకపక్క మిషన్ భగీరథ కు తొవ్విన గుంటలు,నల్లా కనెక్షన్లు ఇతర కనెక్షన్ల పైపులు రోడ్లను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఉన్న సిసి రోడ్లను ధ్వంసం చేయకుండా ముందుగా మట్టి రోడ్ల కడవైన వేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు