ఉద్యమకారుల ఆకాంక్షల నెరవేర్పే లక్ష్యంగా పని చేద్దాం..
గరిడేపల్లి, అక్టోబర్ 7 : మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుట లక్ష్యంగా పని చేద్దామని యంటీయుకే సంక్షేమ సంఘం(NTUK Welfare Association) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులచే నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటంతో ఉద్యమకారుల కుటుంబ జీవితాలు అస్తవ్యస్తమయాయని, వారి చెమట చుక్క, రక్తపు మరక ఆనవాళ్ళతో అందలమెక్కిన నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఉరికంబుమెక్కించిందన్నారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే పడగొట్టామో అదే పార్టీ ఈరోజు ఉద్యమకారులకు గుర్తింపుని ఇవ్వడంలో ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు.
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు ఒక్కొక్కటిగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 25 వేల రూపాయల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఉచిత కార్పొరేట్ వైద్యం తదితర హామీలను వెంటనే ప్రభుత్వం అమలుపరచాలన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే కమిటీకి తుది నిర్ణయపు బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. నిజాయితీగా ఉద్యమంలో పాలుపంచుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భూమిక పోషించిన ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేలా మన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు మేకపోతుల నరసయ్య, వీరంరెడ్డి శంబిరెడ్డి, పంగ వీరయ్య, కారింగుల రామయ్య, ఎడవెల్లి బాటసారి, బెల్లంకొండ శేఖర్, పిడమర్తి రాజు, బొమ్మ నాగరాజు, అనంతు చంద్రయ్య, సప్పిడి శంబిరెడ్డి, గోపాల్ రెడ్డి, రాతికింది వీరస్వామి, పోలిశెట్టి రామయ్య, గుగులోతు హేమ్లా నాయక్, వెంకటరెడ్డి, కీసర వెంకటేశ్వర్లు, పిట్ట నరసయ్య తదితరులున్నారు.