నకిలీ డెత్ సర్టిఫికెట్ల కేసులో మీసేవ ఆపరేటర్ అరెస్టు
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో(Mancherial District) కలకలం రేపిన అనధికార డెత్ సర్టిఫికెట్ల కేసులో(Death Certificate Case) మరొకరు అరెస్టు అయ్యారు. పోలీసులు తాజాగా ఈ కేసులో కాల్టెక్స్ మీ-సేవ ఆపరేటర్(Caltex Me-Seva Operator) ను పట్టుకున్నారు.. బెల్లంపల్లి(Bellampalli) రూరల్ సీఐ హనోక్ అరెస్టు వివరాలను శనివారం వెల్లడించారు. ఇటీవల బెల్లంపల్లి మండలంలో అనధికారికంగా మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో పోలీసులు ఈ నెల 21 న ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఐదుగురు నిందితులను రిమాండ్ లో ఉన్నారు. వారిని ఈ కేసు
తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించగా, A2 నిందితుడు చిలుముల రవి ఇచ్చిన సమాచారం మేరకు, బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ప్రాంతంలో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్న గణేష్ అరెస్టు చేశారు. ఆపరేటర్ గణేష్ కు కమిషన్ చెల్లించి, అతని మీ-సేవ కేంద్రం ద్వారా ఆరుగురు వ్యక్తులకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది.
వాటిలో నలిమేళ రామయ్య అనే వ్యక్తికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం పొందేందుకు ఎటువంటి ఆధార పత్రాలు సమర్పించకుండా, కేవలం ఒక తెల్ల కాగితాన్ని చిరునామా ఆధారంగా చూపిస్తూ దరఖాస్తు చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ విధంగా సరైన ఆధార పత్రాలు లేకుండా అనధికారికంగా మరణ ధృవీకరణ పత్రాల జారీకి సహకరించిన కాల్టెక్స్ మీ-సేవ కేంద్రం నిర్వాహకుడు గణేష్‌ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
ఈ కేసులో మరొకరు A3 నిందితుడు మసాది వైకుంఠం పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హనోక్ తెలిపారు.