అనస్థీషియాపై అపోహలు వద్దు
మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల సూచన
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): శస్త్రచికిత్స సమయంలో రోగికి నొప్పి తెలియకుండా చూడటంతోపాటు గుండె స్పందన, శ్వాస, రక్తపోటు వంటి ప్రాణాధార వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించడంలో అనస్థీషియాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తారని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్(Medicover Women and Child Hospitals) హెచ్ఓడీ, అనస్థీషియాలజీ, పీడియాట్రిక్ అండ్ హైరిస్క్ ఆబ్స్టెట్రిక్ అనస్థీషియా నిపుణులు డాక్టర్ గౌరి శంకర్ బి తెలిపారు.
అనస్థీషియా అంటే కేవలం మత్తు ఇవ్వడం మాత్రమే కాదని, శస్త్రచికిత్సకు ముందు రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వే యడం, తగిన విధానాన్ని ఎంపిక చేయడం, శస్త్రచికిత్స అనంతరం నొప్పిని నియంత్రిస్తూ సురక్షితంగా కోలుకునేలా చూడటం కూడా ఇందులో భాగమని వివరించారు. ముఖ్యంగా పిల్లలు, అధిక ప్రమాదం ఉన్న గర్భిణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారు. అనస్థీషియాపై ఉన్న అపోహలను వీడాలని, రోగులు తమ ఆరోగ్య సమ స్యలు, అలర్జీలు, వాడుతున్న మందులు, గతంలో ఎదురైన ఇబ్బందులను వైద్యులకు ముందుగానే తెలియజేయాలని సూచించా రు. శస్త్రచికిత్సకు ముందు ఆహారం, పానీయాల విషయంలో వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.