ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అవగాహన
గుండాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమావేశ మందిరంలో మహిళల, పిల్లల అక్రమ రవాణా, సైబర్ ట్రాఫికింగ్ మరియు సంబంధిత చట్టాలపై అంగన్వాడీ టీచర్లకు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ(Prajwala voluntary organization) ఆధ్వర్యంలో ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ సరోజిని ముఖ్య అతిథిగా హాజరై అక్రమ రవాణా నివారణలో అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర పోషించాలని, బాల్య వివాహాలు, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు.
ప్రజ్వల జిల్లా సమన్వయకర్త సురేష్ కుమార్ బీఎన్ఎస్, ఐటీపీఏ, పోక్సో, బాల్య వివాహాల నిషేధ చట్టం, జేజేఏ తదితర చట్టాలు, 112, 1930, 181 హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్ నీలిమ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు అన్నపూర్ణ, వాసవి మరియు మండల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.