నూతన చేయూత పెన్షన్ల మంజూరు

18-11-2026 | 03:39pm

జగిత్యాల, నవంబర్ 18 ( విజయ క్రాంతి ): జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్‌లో(Devisri Garden) 969 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల  ఉత్తర్వు పత్రాలను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial Legislator Dr. Sanjay Kumar), మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పంపిణీ చేశారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, గీత, నేత కార్మికులకు, ఫైలేరియా ఉన్న వారికి చేయూత పెన్షన్లు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని తెలిపారు. అతి త్వరలో అర్హులు అందరికీ చేయుత పెన్షన్ లు మంజూరు కు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలని లో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు తడి పొడి చెత్త వేరుగా ఇవ్వాలి అన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి ఉద్దేశం అని గుడిసెలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత గా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా తో ప్రయోజనం కలుగుతుందని, ఇందిరమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని అన్నారు. అర్హులుగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, చేయుత పెన్షన్ లు రానివారు కలెక్టరేట్ కార్యాలయం లో హెల్ప్ డెస్క్ లో సంప్రదించి వివరాలు ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, పట్టణ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు