ప్రజా పాలన ప్రభుత్వానికి పాలాభిషేకం

18-11-2026 | 03:34pm

ఖానాపూర్ (విజయక్రాంతి ): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వం చిత్రపటానికి ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేకం చేశారు .ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కృషి వల్ల ఖానాపూర్ మున్సిపాలిటీలో చేయూత పెన్షన్లు నిరుపేదలు,

ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు ,లాంటి వారి జీవితాల్లో నూతన పెన్షన్లు మంజూరు చేసి వెలుగులు నింపిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ రాజుర సత్యం, నిమ్మల రమేష్, సాజిదా ఖురేషి, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, పార్టీ పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్, నాయకులు దేవతి రాజేశ్వర్, షౌకత్ పాషా, మధిర సత్యనారాయణ,లావుడ్య లాలు ,దాసరి రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు