సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
నిర్మల్ నవంబర్ 18 ( విజయ క్రాంతి): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ మాధవరావు(Revenue Additional Collector Madhav Rao) అన్నారు. బుధవారం నిర్మల్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలో నెలకొన్న సమస్యలపై ఆయా గ్రామాల సర్పంచులు అధికార దృష్టికి తీసుకొచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రావడం లేదని, ఉపాధి హామీ పక్కల్లో పనులు చేసిన బిల్లులు రావడంలేదని సర్పంచ్లు తెలిపారు. గ్రామాల్లో వీధిలైట్లు వెలుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని సర్పంచ్ తెలిపారు.
గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచాలని చెప్తున్నా అధికారులు నిధులు మాత్రం ఇవ్వకుండా ఇలా పనిచేయాలని కొందరు సర్పంచ్లు అధికారులను నిలదీశారు. సర్పంచుల ను గౌరవిస్తూ వారి పనులు పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్ ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి తాసిల్దార్ ప్రభాకర్అధికారులు పాల్గొన్నారు.