కేజీబీవీలో మౌలిక వసతులు కల్పించాలి
ఇంటర్లో 100 శాతం ప్రవేశాలు నమోదు చేయాలి.
అచ్చంపేట :- కేజీబీవీ విద్యార్థినులకు(KGBV students) నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(Collector Hemant Keshav Patil) ఆదేశించారు. మంగళవారం అచ్చంపేట మండలం నడింపల్లి కేజీబీవీని సబ్ కలెక్టర్(Sub-Collector visits KGBV) సలోని చాబ్రాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 160 మంది విద్యార్థులకు గాను 95 మంది మాత్రమే ఉండటంపై ఆరా తీసి, ఇంటర్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలని సూచించారు.
ప్రహరీ నిర్మాణం త్వరగా పూర్తి చేయడంతో పాటు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విద్యార్థినులకు ఏఐ కోర్సులపై అవగాహన కల్పించాలని, పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.