బాధిత కుటుంబాలకు కీసర సంతోష్ రెడ్డి పరామర్శ
* మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు
* గాయపడిన, అనారోగ్యంతో బాధపడుతున్న నాయకులకు పరామర్శ
మోతె, నవంబర్ 10 (విజయక్రాంతి):- మండల పరిధిలోని నామవరం గ్రామంలో(Namavaram Village) ఇటీవల మృతి చెందిన స్వర్గీయ ఏలేటి వెంకట్ రెడ్డి(Eleti Venkat Reddy), స్వర్గీయ బైరి కౌసల్య కుటుంబాలను మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి(Keesara Santhosh Reddy) పరామర్శించారు. వారి చిత్రపటాలకు పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ఇటీవల ఘర్షణలో గాయపడిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొక్క చంద్రారెడ్డిని, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అదే గ్రామానికి చెందిన తాటికొండ శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.