50వ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయాలి

10-11-2026 | 03:11pm

గణపురం, నవంబర్ 10 (విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ అధ్యక్షతన 50వ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల(Golden Jubilee celebrations) కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ జేబీ రాజు 1976లో స్థాపించిన సంఘానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 14న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించే సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

అణగారిన వర్గాల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్ వ్యవస్థాపక సభ్యులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య ముప్పిడి శంకర్ రత్నం శేఖర్ దూడపాక శ్రీనివాస్ చిలువేరు ఉదయాకర్ పసునూటి శంకర్ చిలువేరు శంకర్ సామర్ల సంపత్ అక్కపాక సుమన్ జన్య ప్రశాంత్ జన్నె కుమార్ మంద శ్రీకాంత్ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు