కానిస్టేబుల్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు

10-11-2026 | 03:09pm

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రామస్వామి(AR Constable Ramaswamy) కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును(Insurance check) జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ మంగళవారం అందజేశారు. పోలీస్ భద్రత వెల్ఫేర్ అసోసియేషన్ మంజూరు చేసిన వ్యక్తిగత బీమా చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించారు. మృతుడి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు