కిరాణా షాపును ప్రారంభించిన సర్పంచ్ అనిల్
జుక్కల్, నవంబర్ 10 (విజయక్రాంతి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ మండలంలోని(Jukkal Mandal) పెద్ద ఏడ్గి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణా షాపును(Grocery store) గ్రామ సర్పంచ్ అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ అనిల్ రిబ్బన్(Sarpanch Anil Ribbon) కట్ చేసి కిరాణా షాపును లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా షాపును ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వినోద్, టీఆర్‌పీ నాయకుడు ఖండేరావు, యాదవ్, గంగా గౌడ్ తదితరులు పాల్గొని షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.