నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

28-11-2026 | 07:19pm

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట పోలీస్ స్టేషన్(Narsimhulapet Police Station)ను శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(Mahabubabad SP Dr. Shabareesh) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించాలని, గుడుంబా తయారీకి సంపూర్ణంగా అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కృషి చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో జాప్యం ఉండకూడదని , ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని , సైబర్ నేరాల నియంత్రణకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు..వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సిబ్బంది సంఖ్య, వారికి కేటాయించిన విధులు, ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు