విద్యార్థులకు పారిశ్రామిక విజ్ఞానం అందించడమే లక్ష్యం
పారిశ్రామిక పర్యటనను ప్రారంభించిన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య
వేమనపల్లి, ( విజయక్రాంతి ) : విద్యార్థుల్లో(students) పారిశ్రామిక అవగాహన(Industrial Awareness), శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై(Science and Technology) ఆసక్తి పెంపొందించడమే పీఎంఎస్హెచ్ఆర్ఐ పథకంలో(PMSHRI Scheme) భాగంగా మంచిర్యాల జిల్లా(Mancherial District) వేమనపల్లి మండలంలోని జెడ్పీఏచ్ఎస్ ఉన్నత పాఠశాల(ZPHS High School) నీల్వాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక పర్యటనను సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు , గ్రామ సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు ప్రయాణించే బస్సుకు కొబ్బరికాయ కొట్టి పర్యటనకు పచ్చజెండా ఊపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక జ్ఞానంతో పాటు పరిశ్రమలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా ఆచరణాత్మక విజ్ఞానం పెరుగుతుందని, విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిరిధర్ రెడ్డి, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కోడూరి దుర్గయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.