రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

28-11-2026 | 07:25pm

నేర కార్యకలాపాలకు  పాల్పడితే కఠిన చర్యలు

ఏసీపీ బి. మోహన్ కుమార్

మేడిపల్లి, నవంబర్ 28 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్(Malkajgiri Police Commissionerate) మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు(Rowdy sheeters) శనివారం ఏసీపీ బి. మోహన్ కుమార్, సీఐ డి. జలంధర్ రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు  ప్రస్తుత స్థితిగతులు, జీవనోపాధి, నివాసం, కుటుంబ నేపథ్యంపై వివరాలు సేకరించారు. ఎవరూ అసాంఘిక, నేర కార్యకలాపాలకు(antisocial and criminal activities) పాల్పడకుండా శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం బైండోవర్, పీడీ యాక్ట్(PD Act) వంటి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఏసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు