వాటర్ హీటర్ విద్యుత్తు షాక్‌తో వ్యక్తి మృతి

28-11-2026 | 07:29pm

సుల్తానాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన పూసాల శ్రీనివాస్ (38) వాటర్ హీటర్ విద్యుత్ షాక్‌కు(Electric Shock) గురై మృతి చెందాడు. శనివారం ఇంట్లో వాటర్ హీటర్‌ను(Water heater) వినియోగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యుల రోధనలు పలువురిని కంటతడి పెట్టించాయి, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు