అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

28-11-2026 | 07:20pm

ములుగు, నవంబర్ 28 (విజయక్రాంతి) : ములుగు మున్సిపాలిటీ(Mulugu Municipality) పరిధిలోని హనుమాన్ బస్తీలో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు(Drainage construction works), పట్టణ ప్రధాన రహదారిపై చేపడుతున్న డివైడర్ విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీ పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలు, ప్రజలకు కలిగే సౌకర్యాలు, డివైడర్ విస్తరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ సౌజన్య, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు