కార్యక్రమాన్ని ఆదివాసీలు విజయవంతం చేయాలి

18-11-2026 | 02:43pm

బోథ్. నవంబర్ 18 (విజయక్రాంతి): డిసెంబర్ 9న హైదరాబాద్లో జరిగే ఆదివాసుల సభను(Tribal Gathering) విజయవంతం చేసేందుకు ఆదివాసీలలోని తొమ్మిది తెగలవారు కృషి చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితిబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగే స్ లుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను సోనాల మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి ఆదివాసి సభకు తరలిరావాలన్నారు కార్యక్రమంలో సోనాల మండల కమిటీ నాయకులు తుడసం లక్ష్మణ్, నైతం దేవరావు సోయం బాపూరావు గంగాధర్ ప్రధాన కార్యదర్శి సిడం జాకీస్ సర్పంచ్ లక్ష్మణ్ నైతం దేవరావు మాజీ సర్పంచ్ రాందాస్ ధర్మన్న  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు