జోరుగా జీరోలో ఇసుక వ్యాపారం.!

17-11-2026 | 06:46pm

అర్ధరాత్రి పూట లారీలలో రాక. 

బోథ్, నవంబర్ 17( విజయక్రాంతి): బోత్ సోనాల మండల కేంద్రంలో(Sonala Mandal Headquarters) ఇసుక వ్యాపారం(Sand business) జోరుగా సాగుతున్నది. అర్ధరాత్రి పూట లారీలలో అక్రమంగా తీసుకువచ్చిన ఇసుక లారీలు ఖాళీ అవుతున్నాయి.

వ్యాపారం లక్షల్లో కొనసాగుతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టే నాథుడు  లేడని స్థానికులు అంటున్నారు. రాత్రిపూట కొనసాగుతున్న జీరో వ్యాపారం పైన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. 

లక్షలుఆర్జిస్తున్న చిల్లర వ్యాపారం.

ఆయా మండల కేంద్రాలలో ఇసుక వ్యాపారం చేసేవారు లారీలలో తెప్పించిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా విక్రయిస్తున్నారు. జీరోలో వచ్చిన ఇసుకను కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరల్లో విక్రయిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇసుకను విక్రయిస్తున్నారని అంటున్నారు. ఇసుక అక్రమ అభిప్రాయాలపై అధికారులు దృశ్య సారించాలని స్థానికులు కోరుతున్నారు. 

చీకటి వ్యాపారం

అర్ధరాత్రి పూట వస్తున్న ఇసుక లారీలను అడ్డుకునే వారు లేకపోవడంతో ఇసుక వ్యాపారులది ఇష్టారాజ్యంగా సాగుతుందని అంటున్నారు. స్థానికంగా ఉన్న ఇసుక వ్యాపారులు ఏకమై ఇష్టమున్న ధరలలో విక్రయిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

జీరో వ్యాపారం వల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన రెంటల్ చెల్లించకుండానే కొంతమంది నిర్మల్ కు చెందిన లారీల యజమానులు అక్రమ వ్యాపారాలుగా మారారని అంటున్నారు. ఏది ఏమైనా ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. అధికారులు కట్టడి చేయకపోతే ఇసుక మాఫియా మరింత రెచ్చిపోయే ఆస్కారం ఉందని అంటున్నారు.

మరిన్ని వార్తలు