డ్రెయిన్ మధ్యలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

10-11-2026 | 03:21pm

పనులను నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు వినతి

పాల్వంచ, నవంబర్ 10, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణంలోని ములకలపల్లి రోడ్డు నుండి తెలంగాణ నగర్‌కు వెళ్లే సీసీ రోడ్డు(CC Road) పక్కన ఉన్న డ్రెయిన్ మధ్యలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు(Installation of electricity poles) విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) గోతులు తవ్వడంపై నిలిపివేయాలని కోరుతూ బిజెపి జిల్లా నాయకులు మనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం సంబంధిత మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రెయిన్ మధ్యలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం వల్ల మురుగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని, భవిష్యత్తులో డ్రెయిన్ శుభ్రపరిచే పనులు, నిర్వహణ కూడా కష్టతరమవుతాయని తెలిపారు. ముఖ్యంగా ప్రతి వర్షాకాలంలో పక్కనే ఉన్న గుట్ట నుంచి భారీగా వరదనీరు ఈ డ్రెయిన్‌లోకి ప్రవహిస్తుందని, అలాంటి పరిస్థితుల్లో డ్రెయిన్ మధ్యలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తే వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజాధనంతో నిర్మించిన డ్రెయిన్ వ్యవస్థకు నష్టం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పనులకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై విచారణ జరిపించాలి. అనుమతులు లేకుండా పని చేసిన కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొంద్ సాహెబ్,ప్రశాంత్,లక్ష్మణ్,రుద్రా,చిరంజీవి,రఫీ లు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు