జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ నిరాహార దీక్ష
శ్రీరాంపూర్, (విజయక్రాంతి) : సింగరేణిలో(Singareni) వివిధ కారణాలతో అన్ ఫిట్ అయి డిపెండెంటు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న 210 డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధ వారం శ్రీరాంపూర్ జీఎం (GM) కార్యాలయం ముందు ఏఐటీయూసీ నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ తో కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహించి వివిధ అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు హజరైన కార్మికులందరిని అన్ ఫిట్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిండరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ. 60 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఈ రిలే నిరాహార దీక్షలో శ్రీరాంపూర్ ఏరియా ఏఐటీయూసీ నాయకులు కూర్చున్నారు.