గౌడ సంఘం. సభ్యత్వాల కోసం నైపుణ్య పరీక్ష
గణపురం ,నవంబర్ 18 (విజయ క్రాంతి): మైలారం గ్రామంలో(Mailaram Village) గౌడ సంఘం ఆధ్వర్యంలో కొత్త సభ్యత్వాల కోసం దరఖాస్తు చేసుకున్న 40 మంది అభ్యర్థులకు తాడిచెట్లు ఎక్కే నైపుణ్యాన్ని(Palm tree climbing skills) అధికారులు పరిశీలించారు. ములుగు ఎక్సైజ్ సీఐ టి. సుస్మిత ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ డి. రాజేందర్, కానిస్టేబుళ్లు ఎం. రాజు, ఏ. బీర్బల్, బి. నరేష్, ఎన్. శ్రావణి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో మైలారం గౌడ సంఘం అధ్యక్షుడు పబ్బ సదయ్య గౌడ్, డైరెక్టర్లు గునిగంటి కృష్ణ, మోటపోతుల సమ్మయ్య గౌడ్, పబ్బ సంతోష్ గౌడ్, సాంబయ్య గౌడ్, కిరణ్ గౌడ్, రవి గౌడ్, మద్ది సత్యం గౌడ్, సురేష్, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.