వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సొసైటీ చైర్మన్
నాగిరెడ్డిపేట్,నవంబర్ 18 (విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద సొసైటీ(Bumblebee Society) పరిధిలోని పిసిసి సెంటర్ గోలిలింగాల గ్రామ కొనుగోలు కేంద్రంలో శుభ్రపరచిన (క్లీనింగ్ పట్టిన) వరి ధాన్యం కొనుగోలును మాల్తుమ్మెద సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ కళాలి సురేందర్ గౌడ్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది.
శుభ్రపరచిన వరి ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా 40 కేజీల 700 గ్రాముల బరువుతో వరి ధాన్యం కాంట చేయడం జరిగిందనీ సొసైటీ చైర్మన్ కళాలి సురేందర్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కళాలి సురేందర్ గౌడ్ మాట్లాడుతూ...బయట ఎవరు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్రకాయల రోజా బాబు, డైరెక్టర్ మహేష్ రెడ్డి,భీమయ్య, రాజంపేట యాదగిరి, సీఈవో సందీప్,ఉప సర్పంచ్ రవి,రైతులు గ్రామస్తులు,పాల్గొన్నారు.