నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా కల్పన
18-11-2026 | 02:56pm
నిర్మల్ నవంబర్ 18 ( విజయ క్రాంతి): టిజిఎస్ఆర్టిసి నిర్మల్ ఆర్టీసీ డిపో(TGSRTC Nirmal RTC Depot) నూతన మేనేజర్‌గా కల్పన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించిన కే. పండరి హైదరాబాద్‌లోని జీడిమెట్ల డిపోకు బదిలీ అయ్యారు. జగిత్యాల డిపో మేనేజర్ గా పనిచేసిన ఆమె నిర్మల్ డిపో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన డిపో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన కల్పనకు పలువురు ఆర్టీసీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.