పెన్షన్ పత్రాల పంపిణీ
నిర్మల్ నవంబర్ 18 ( విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం(Government 'Cheyutha' Scheme) కింద లబ్ధిదారులకు కొత్త పెన్షన్ అందిస్తుందని కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ @ రఫ్ఫూ అన్నారు. నిర్మల్ పట్టణంలోని 27,39 వార్డుల్లో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్ ఉత్తర్వులను బుధవారం పంపిణీ చేశారు. లబ్ధిదారులకు మిఠాయిలు పంచారు.
వ్యక్తిగత తోడ్పాటుతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించేందుకు భీమా పథకం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని, ఆదరించాలన్నారు.