రోడ్లపైనే వ్యాపారాలు తప్పని తిప్పలు

09-11-2026 | 03:51pm

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రమైన సోనాలలో అంతరాష్ట్ర రహదారి పైన వివిధ ప్రాంతాల నుండి వచ్చేవారు రోడ్ల పైన వాహనాలను ఇవ్వడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బస్టాండ్ నిర్మాణం చేపట్టి ప్రజల బాధలు తీర్చాలని కోరుతూ సోనాల మండల కేంద్రానికి చెందిన యువకులు ప్రజావాణిలో సోమవారం ఎంపీడీవో రత్నాకర్ రావుకు వినతిపత్రం అందించారు.

చిరు వ్యాపారం అంత రోడ్లపైనే కొనసాగుతుందని, అంతేగాక వ్యాపార సముదాయాల ముందు వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో జనం అంత రోడ్లపైనే గుమి గూడి ఉంటున్నారని వారు వినతి పత్రంలో వివరించారు. ముఖ్యంగా మహిళలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బస్టాండ్ నిర్మాణం జరిగేలా చూసి ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలం వేరే చోట చూపించాలని గ్రామ యువకులు కోరారు.

మరిన్ని వార్తలు