పలు గ్రామల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు
జగిత్యాల,(విజయక్రాంతి)ఫ జగిత్యాల అర్బన్ మండలం(Jagtial Urban Mandal) ధరూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri) ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంజూరైన నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను గ్రామ ప్రజలకు, సంబంధిత సంఘం ప్రతినిధులకు అందజేసిన బీజేపీ జగిత్యాల నియోజక వర్గ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధుల నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రజలకు, సామాజిక వర్గాలకు ఉపయోగపడే భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎంపీ అరవింద్ ధర్మపురి కి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదారి అశోక్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు నరపాక అశోక్, అర్బన్ మండల ఉపాధ్యక్షులు తిరుపతి, ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు దానపనేని నరేష్, సల్ల రమేష్, ఇట్యాల రాము, మ్యాదరి శ్రీనివాస్, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.