వెల్గొండ చెరువు శిఖంలో మట్టి తొలగించాలని ఫిర్యాదు

09-11-2026 | 03:44pm

బిజినేపల్లి: మండలంలోని వెల్గొండ గ్రామ(Velgonda village) పోచమ్మ చెరువు శిఖం భూమి(Pochamma Lake shikam land)ని ఆక్రమించి నింపిన మట్టిని తొలగించాలని ఆ గ్రామ సర్పంచ్ నాగోలు నాగిరెడ్డి సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నం.2 లో ఉన్న పోచమ్మ చెరువులో అదే గ్రామానికి చెందిన ఒక  వ్యక్తి వందల కొద్ది టిప్పర్ల మట్టిని పోసి శిఖం భూమిని  పూడుస్తున్నాడు.

ఈ విషయమై స్థానిక తహశీల్దారుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పిర్యాదులో పేర్కొన్నాడు. శిఖం భూమిని మట్టితో నింపడం వలన చెరువులో నీటి నిల్వ తగ్గిందని, చెరువుకు అనుకోని ఉన్న లక్ష్మీ బాయి దగ్గర చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టరీత్యా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కలెక్టరును కోరారు.

మరిన్ని వార్తలు