ఏపీ కూటమి ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు
దమ్మపేట మండల టీడీపీ
దమ్మపేట,(విజయక్రాంతి): ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన విధంగానే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని దమ్మపేట తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కూటమి తరపున గెలిచిన నగర మేయర్, మున్సిపల్ చైర్మన్లు, జడ్పిటిసి, ఎంపీటీసీలకు దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం దమ్మపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి నాయకులు మాట్లాడుతూ... ఏపీ లో కూటమి తరపున గెలిచిన మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, జడ్పిటిసి, ఎంపిటిసిలకు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఎండి వలీపాషా, సొసైటీ వైస్ చైర్మన్ కట్టం ఎర్రప్ప, తెలుగు రైతు సంఘం అధ్యక్షులు గడ్డిపాటి సత్యనారాయణ, నాయుడు వీరాస్వామి, బొల్లా మోహన్ రావు, పారుపల్లి భద్రం, భోగి సత్యం, చిర్ర ధర్మారావు, నాయుడు సుబ్బారావు, పానుగంటి రామారావు, అల్లాడి అప్పారావు, ఊకే కుమారి, చక్రపు ప్రసాదు, బాబురావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.