ప్రజావాణి ఫిర్యాదుపై సమగ్ర విచారణ

09-11-2026 | 03:36pm

జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

జగిత్యాల,(విజయక్రాంతి): సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అందిన బాధితురాలు ఫిర్యాదుపై సంబంధిత అధికారులతో విచారణ చేపట్టి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(Collector B. Satyaprasad) తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్(Bedroom Complaint) వద్ద జీవనోపాధి కొరకు టేల నడుపుతుంటే కొందరు అడ్డుకుంటున్నారని ఇచ్చిన దరఖాస్తు పరిశీలించి, మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner)ను వివరణ కోరగా నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ వద్ద ఎలాంటి  షాప్ లకు, టేలలకు అనుమతులు ఇవ్వలేదని తెలియజేశారు.

బాధితురాలు ఫిర్యాదుపై పూర్తి వివరాలు సేకరిస్తామని పేర్కొన్నారు. విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పారదర్శకంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని కలెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు