ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి అండ

09-11-2026 | 03:32pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆరోగ్య శాఖలో ఎన్‌హెచ్‌ఎం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Laxmi) అండగా నిలుస్తున్నారని మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్(Municipal Chairman Mengre Akash) అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారంతో 28వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా సమ్మెకు మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి సమ్మె చేస్తున్న ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఇందులో భాగంగా ప్రతిరోజూ భోజన సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, పార్టీ మండల అధ్యక్షుడు జబోరే రవీందర్, నాయకులు సాంగ్డే జీవన్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు