సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడిగా సమ్మయ్య నాయక్

09-11-2026 | 03:26pm

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య సమ్మయ్య నాయక్ సోమవారం ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా వీరమల్ల సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎలుక పెళ్లి రమేష్, కోశాధికారిగా పూజారి రాజేందర్ గౌడ్,లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి భాస్కరరావు, ఎండి చోటేమియా, కన్నబోయిన కుమార్ యాదవ్, బోనాల రాజమౌళి,లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు