ఎమ్మెల్యే విజయ జన్మదిన వేడుకలు

09-11-2026 | 03:23pm

శివపల్లిలో అంబరాన్ని అంటిన సంబరాలు

పండుగ వాతావరణాన్ని తలపించిన జన్మదిన వేడుకలు

యువత కేరింతలతో జోష్... అర్ధరాత్రి విజ్జన్నకు జన్మదిన శుభాకాంక్షలు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తనకురాజకీయప్రాతినిధ్యంకల్పించి,కౌన్సిలర్ గా చేసిన మా అన్న  ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు విన్నూతన రీతిలో విజయ రమణారావు నివాసం ముందు అభిమానులు యువత, పార్టీ శ్రేణుల మధ్య సుల్తానాబాద్ మున్సిపల్ ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్, యువ నేత గోదల సునీల్ రెడ్డిల ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసి, రాత్రి 12 గంటల కు విజ్జన్నకు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపి గురుతర బాధ్యతను నిర్వర్తించారు.

అభిమానులు పార్టీ శ్రేణులు యువత మధ్య కోలాహాలంగా, అట్టహాసంతో కేరింతలు వేస్తూ, అభిమాన నాయకునికి నెత్తికి కిరీటం ధరించి, చేతికి ఖడ్గం అందించి, అతి భారీ కేకును కట్ చేయించారు. ఉత్సాహ భరితంగా జరిగిన ఈ కార్యక్రమం దాదాపు గంటసేపు జరిగింది. ఎప్పుడు ఎక్కడ లేని విధంగా విజ్జన్న జన్మదిన వేడుకలను  నివాసం ముందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్, యువ నేత గోదల సునీల్ రెడ్డి మాట్లాడుతూ... మా అభిమాన విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నిత్యం ప్రజా సేవలో తనదైన శైలిలో దూసుకుపోతూ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రజాసేవ చేయడం గర్వకారణంగా ఉందన్నారు. అలాంటి మంచి మనసున్న విజ్జన్న జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రానున్న రోజులలో విజ్జన్న  మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలి.

ప్రజాసేవలో ఓటమెరుగని నాయకునిగా ఉండాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని భాకం సాయికిరణ్ యాదవ్, గోదల సునీల్ రెడ్డి కొనియాడారు. రెండుసార్లు ఓటమి పాలు అయినా కానీ, ఏమాత్రం వెనుకడుగు వేయక, ప్రజాక్షేత్రంలో నిలిచిన ఏకైక గొప్ప వ్యక్తి విజయ రమణారావు అని తెలిపారు.

రానున్న రోజులలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా తిరిగి భారీ మెజార్టీతో గెలుపొంది మంత్రి పదవి వరిస్తుందని వారు తమ ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్మదిన సంబరాల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు, రాష్ట్ర యువ నేత దుగ్యాల సంతోష్ రావు తో పాటు పార్టీ శ్రేణులు అభిమానులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు